తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు 2025 - 10వ తరగతి అర్హతతో | TS Outsourcing Jobs 2025
తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు 2025 - 10వ తరగతి అర్హతతో
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం 52 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ECG టెక్నీషియన్, దోబీ, CT టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఈ ఉద్యోగాల్లో ఉన్నాయి.
వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయవచ్చు.
ప్రధాన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 7 జనవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 17 జనవరి 2025
- తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల తేదీ: 27 జనవరి - 29 జనవరి 2025
- చివరి మెరిట్ జాబితా: 31 జనవరి 2025
- కామి నియామక తేదీ: 3 ఫిబ్రవరి 2025
వయసు పరిమితి:
- అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది.
పోస్టుల వివరాలు:
ఈ ఉద్యోగాల్లో మొత్తం 52 పోస్టులు ఉన్నాయి:
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- ల్యాబ్ అటెండెంట్
- వార్డ్ బాయ్స్
- గ్యాస్ ఆపరేటర్
- థియేటర్ అసిస్టెంట్
- డ్రైవర్
- ప్లంబర్
- ఎలక్ట్రీషియన్
- ECG టెక్నీషియన్
- దోబీ
- CT టెక్నీషియన్
- రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్
అర్హతలు:
- 10వ తరగతి, 10+2, డిగ్రీ, PG అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంచుకుంటారు.
- రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
జీత వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు ₹15,600/- నుండి ₹22,750/- వరకు జీతం ఉంటుంది.
- ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ కింద ఉన్నందున ఇతర అలవెన్సులు అందవు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
- OC, OBC అభ్యర్థులు: ₹300/-
- SC, ST అభ్యర్థులు: ₹200/-
- ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కుమారాంభీమ్ ఆసిఫాబాద్ పేరిట చెల్లించాలి.
- ఫీజు చెల్లింపు రశిదుతో దరఖాస్తు సమర్పించాలి.
అవసరమైన ధృవపత్రాలు:
- పూర్తయిన దరఖాస్తు ఫారం
- 10వ తరగతి మార్కుల జాబితా
- కుల ధృవపత్రం
- అధ్యయన ధృవపత్రాలు మరియు అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- అనుభవ సర్టిఫికేట్‌లు
దరఖాస్తు విధానం:
- నోటిఫికేషన్ వివరాలు పరిశీలించిన తర్వాత, డౌన్లోడ్ నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం ఉపయోగించి దరఖాస్తు చేయాలి.
లింక్:
నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం
Telangana Jobs, Outsourcing Jobs 2025, Government Jobs, TS Jobs, Telangana Recruitment, Data Entry Jobs, Lab Attendant Jobs, Ward Boy Jobs, Technician Jobs, Driver Jobs, Electrician Jobs, Plumber Jobs, 10th Pass Jobs, Telangana Youth Jobs, Jobs for Freshers, Merit-Based Selection, Merit List Jobs, No Exam Jobs, Salary 15600 to 22750, Contract Jobs, TS Outsourcing Jobs, Telangana Notifications, Kumaram Bheem Jobs
0 Comments