ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సహకార సంఘాల్లో 251 ప్రభుత్వ ఉద్యోగాలు | AP DCCB బ్యాంక్ నోటిఫికేషన్ 2025
AP DCCB బ్యాంక్ నోటిఫికేషన్ 2025:
ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ (DCCB) 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టుల శాశ్వత భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంపిక రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
ముఖ్య తేదీలు:
251 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్స్ ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ తేదీల్లో చేసుకోవాలి:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 8 జనవరి 2025
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 22 జనవరి 2025
- ఆన్‌లైన్ CBT రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2025
ఫీజు వివరాలు:
- SC, ST, PHC, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు: ₹500/-
- ఇతర అభ్యర్థులు: ₹700/-
వయో పరిమితి:
- DCCB బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు వయసులో 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అర్హతలు:
- డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టుల శాశ్వత భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జీతం వివరాలు:
- ఎంపికైన అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ₹30,000/- నుండి ₹40,000/- వరకు జీతం అందించబడుతుంది.
- ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష: ఫిబ్రవరిలో CBT పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రశ్నలు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ విషయాలపై ప్రశ్నలు అడుగుతారు.
- తెలుగు చదవగలగడం మరియు వ్రాయగలగడం తప్పనిసరి.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలు కల్పించబడతాయి.
అవసరమైన సర్టిఫికేట్లు:
- డిగ్రీ అర్హత ధ్రువీకరణ పత్రం
- 10వ తరగతి మార్కుల మెమో
- స్టడీ, కుల ధ్రువపత్రాలు
ఎలా దరఖాస్తు చేయాలి:
- నోటిఫికేషన్‌లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
Notification & Apply Online | అధికారిక వెబ్‌సైట్
ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకులు విడుదల చేసిన ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
0 Comments