Tuesday, January 7, 2025

ఆహార శాఖ ఉద్యోగాలు పరీక్ష లేకుండా, ఫీజు లేదు | CSIR CFTRI నోటిఫికేషన్ 2025

ఆహార శాఖ నోటిఫికేషన్ 2025:
సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CFTRI) ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.


ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 7 జనవరి 2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 15 జనవరి 2025

వయో పరిమితి

  • 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు.
  • OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు.

పోస్టుల వివరాలు & అర్హతలు

  • పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసోసియేట్
  • అర్హతలు:
    • MSC బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ లో పూర్తి చేసినవారు అర్హులు.

దరఖాస్తు ఫీజు

  • ఎలాంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

  • పరీక్ష లేదు.
  • మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు కేటాయిస్తారు.

జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థులకు ₹25,000/- నెలకు జీతం.
  • హౌస్ రెంట్ అలవెన్సులు (HRA) కూడా అందజేస్తారు.

అవసరమైన సర్టిఫికేట్లు

  1. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
  2. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
  3. స్టడీ సర్టిఫికేట్లు
  4. కుల ధృవీకరణ పత్రాలు, అనుభవ ధృవీకరణ పత్రాలు.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • CSIR ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ & ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్స్ నుండి దరఖాస్తు చేయవచ్చు.
  • పూర్తిస్థాయి నియామక వివరాలు చూసి, తక్షణమే దరఖాస్తు చేసుకోండి.

క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.

Notification

Apply Online Link

 


తెలుగు రాష్ట్రాలకే ప్రాధాన్యం

  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

#CSIRJobs2025 #FoodDepartmentJobs #NoExamJobs #GovtJobs2025 #APTelanganaJobs

Share this


0 Comments